భోపాల్: పరీక్షల వాయిదా కోసం విద్యార్థులు కుట్రపన్నారు. ప్రిన్సిపాల్ మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. (Students Fake Principal’s Death) ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు విద్యార్థుల పనిగా గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో అక్టోబర్ 15, 16 తేదీల్లో సమగ్ర మూల్యాంకన పరీక్షలు జరుగనున్నాయి.
కాగా, ఇద్దరు బీసీఏ విద్యార్థులు పరీక్షల వాయిదా కోసం ప్లాన్ వేశారు. కాలేజీ అధికారిక లెటర్‌హెడ్ ఫార్మాట్‌తో నకిలీ లేఖ సృష్టించారు. ‘ముఖ్యమైన సమాచారం. ప్రిన్సిపాల్ డాక్టర్ అనామిక జైన్ ఆకస్మిక మరణం కారణంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో జరుగాల్సిన కాలేజీ ఆన్లైన్ పరీక్షలు, తరగతులు వాయిదా పడ్డాయి’ అన్న సందేశాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
మరోవైపు అక్టోబర్ 14న రాత్రి 10:15 గంటలకు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆందోళన చెందిన కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రిన్సిపాల్ అనామిక జైన్‌కు ఫోన్ చేశారు. మరికొందరు హడావుడిగా ఆమె నివాసానికి చేరుకున్నారు. ప్రిన్సిపాల్ మరణించడంతో కాలేజీ పరీక్షలు, తరగతులు వాయిదా పడినట్లు ఆన్లైన్లో వైరల్ అవుతున్నదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
ఆ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ అనామిక జైన్ వెంటనే అలెర్ట్ అయ్యారు. కాలేజీ అధికారుల ద్వారా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు బీసీఏ విద్యార్థుల పనిగా నిర్ధారించారు. మయాంక్ కచ్వాల్, హిమాన్షు జైస్వాల్ ఈ ఫేక్ ప్రచారానికి పాల్పడినట్లు గుర్తించారు. వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: పోలీసుల ముందే ప్రొఫెసర్ చెంపపై కొట్టిన విద్యార్థిని.. వీడియో వైరల్
Dalit Man Urinated | అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించినందుకు.. దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన