WI vs IND : చావోరేవో పోరులో వెస్టిండీస్ సమిష్టి కృషితో భారత్‌కు భారీ స్కోర్‌తో సవాల్ విసిరింది. ఓపెనర్ రోస్టన్ ఛేజ్(40) శుభారంభమిచ్చినా.. జస్ప్రీత్ బమ్రా(2-36) విజృంభణతో ఒకే ఓవర్లో రెండు బిగ్ వికెట్లు కోల్పోయిన విండీస్.. రొవ్మన్ పావెల్(34 నాటౌట్), జేసన్ హోల్డర్(37 నాటౌట్)ల విధ్వంసంతో కోలుకుంది. అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో 24 రన్స్ పిండుకోగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బుమ్రా 14 పరుగులే ఇవ్వడంతో విండీస్ 195కే పరిమితమైంది.
ప్రపంచకప్ సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో వెస్టిండీస్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకొంది. ఆరంభంలో భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయగా.. ఆచితూచి ఆడిన ఓపెనర్లు షాయ్ హోప్(32), రోస్టన్ ఛేజ్(40)లు రిస్క్ తీసుకోలేదు. ఫలితంగా.. పవర్ ప్లేలో విండీస్ వికెట్ కోల్పోకుండా 45 రన్సే చేయగలిగింది. పవర్ ప్లే తర్వాత బిగ్ షాట్లు ఆడాలనుకున్న షాయ్ హోప్(32)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ సైడ్ ఆడాలనుకున్న హోప్ బంతిని అంచనా వేయలేక బౌల్డయ్యాడు. దాంతో.. 68 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని మిస్టరీ స్పిన్నర్ విడదీశాడు.
Innings Break!#TeamIndia have been set a target of 196 🎯
Chase on the other side 👉
Scorecard ▶️ https://t.co/ur4pr8Bi3K#T20WorldCup | #MenInBlue | #INDvWI pic.twitter.com/YEhcmj2Anq
— BCCI (@BCCI) March 1, 2026
పాండ్యా, వరుణ్ ఓవర్లో సిక్సర్లతో రెచ్చిపోయిన షిమ్రన్ హిట్మైర్(27)ను బుమ్రా వెనక్కి పంపి విండీస్‌కు షాకిచ్చాడు. బుమ్రా సంధించిన షార్ట్ బాల్‌ను హిట్మైర్ లెగ్ సైడ్ ఆడాలనుకోగా బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ సంజూకి చిక్కింది. ఆ తర్వాతి రెండో బంతికే ఛేజ్‌ను డైవింగ్ క్యాచ్‌తో సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు. అంతే.. విండీస్ పరుగుల జోరుకు బ్రేక్ పడింది.
Edged and Gone ☝️
Hardik Pandya into the act now 🔥
Updates ▶️ https://t.co/ur4pr8Bi3K#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvWI | @hardikpandya7 pic.twitter.com/VZpj7QlQgn
— BCCI (@BCCI) March 1, 2026
వరుసగా రెండు వికెట్లతో ఒత్తిడిలో పడిన కరీబియన్ జట్టును మరింత షాక్‌కు గురి చేస్తూ.. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(14)ను పాండ్యా వెనక్కి పంపాడు. కానీ, మేమున్నామంటూ జేసన్ హోల్డర్(37 నాటౌట్), రొవ్మన్ పావెల్(35 నాటౌట్)లు దంచేశారు. పాండ్యా, అర్ష్‌దీప్ ఓవర్లో ఇద్దరూ బౌండరీలతో రెచ్చిపోయారు. అర్ష్‌దీప్ ఓవర్లో పావెల్ రెండు సిక్సర్లు, ఫోర్లతో 24 రన్స్ పిండుకున్నాడు. ఆఖరి ఓవర్లో బుమ్రా 14 రన్స్ ఇవ్వగా.. 200 కొడుతుందనుకున్న విండీస్ 195కే పరిమితమైంది.