 
                                                            బెంగళూరు: పొలంలో పని చేస్తున్న రైతులను పులి ఠారెత్తించింది. వారి వైపు అది దూసుకొచ్చింది. దీంతో రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు చెట్లు ఎక్కారు. అయితే ఒక రైతుపై ఆ పులి దాడి చేసింది. (Tiger Mauls Farmer) తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉన్నది. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం బడగలపుర గ్రామంలోని పొలాల్లో కొందరు రైతులు పనులు చేసుకుంటున్నారు.
కాగా, చెట్ల పొదల నుంచి ఒక పులి బయటకు వచ్చింది. పొలాల్లో పని చేస్తున్న రైతుల వైపు అది దూసుకొచ్చింది. దీంతో ఆ పులిని చూసి వారంతా భయాందోళన చెందారు. కొందరు పరుగులు తీశారు. దాని బారి నుంచి రక్షించుకునేందుకు మరి కొందరు చెట్లు ఎక్కారు. అయితే 34 ఏళ్ల రైతు మహాదేవ్పై ఆ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
మరోవైపు ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో తాజా సంఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఆ పులిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాని జాడ కోసం డ్రోన్లతో వెతుకుతున్నారు. కాగా, పొలంలోని రైతులను పులి వెంబడించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Too many tigers? A tiger attacked a person in Badagalpura village, HD Kote, Mysore district.
The victim survived.
At least six transient tigers are on the move in HD Kote.
A tigress was captured in Hediyala (Bandipur) on Sunday and sent to the rehab centre. pic.twitter.com/d9erfohjtR— True Conservation Alliance (@TruConserve) October 17, 2025
Also Read:
Sisters Marry Multiple Men | పలువురిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు.. ఆ తర్వాత డబ్బు, నగలతో పరార్
Watch: పోలీసుల ముందే ప్రొఫెసర్ చెంపపై కొట్టిన విద్యార్థిని.. వీడియో వైరల్
 
                            