Weight Gain Foods | అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. కానీ కొందరు మాత్రం ఎల్లప్పుడూ సన్నగా బక్క పలుచగా ఉంటున్నారు. ఉండాల్సిన బరువు కూడా ఉండడం లేదు. దీంతో అలాంటి వారు బరువు పెరిగేందుకు అనేక రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు ఆహారాలు ఎలాంటి ముఖ్యపాత్ర పోషిస్తాయో అలాగే బరువు పెరిగేందుకు కూడా ఆహారాలనే తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలన్నా పెరగాలన్నా ఆహారాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. సరైన ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు. శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బరువు పెరిగేందుకు గాను సరైన ఆహారాన్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
బరువును పెంచడంలో బాదంపప్పు, వాల్ నట్స్, జీడిపప్పు, పల్లీలు మేలు చేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. వీటిల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు బరువును ఆరోగ్యకరమైన రీతిలో పెరిగేలా చేస్తాయి. దీంతోపాటు అనేక పోషకాలను సైతం పొందవచ్చు. అలాగే అవకాడోలను ఆహారం భాగం చేసుకున్నా మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ పండ్లను తింటే క్యాలరీలు అధికంగా లభిస్తాయి. సులభంగా బరువు పెరుగుతారు. అవకాడోలను టోస్ట్, సలాడ్లు, శాండ్ విచ్లు, స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నా మేలు జరుగుతుంది. కొవ్వు తీయని పాలు లేదా పెరుగును తింటున్నా కూడా బరువు పెరుగుతారు. చీజ్‌ను కూడా తినవచ్చు. దీని ద్వారా కొవ్వులు, ప్రోటీన్లు, క్యాల్షియం పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఇవి బరువును ఆరోగ్యకరమైన రీతిలో పెంచేందుకు సహాయం చేస్తాయి.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. కనుక చేపలను తరచూ తింటున్నా ఉపయోగం ఉంటుంది. వీటిని తింటే హై క్వాలిటీ ప్రోటీన్లు కూడా లభిస్తాయి. ఇవి కండరాలను దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. బరువును ఆరోగ్యకరమైన రీతిలో పెంచుతాయి. బరువు పెరగాలనుకునే వారు రోజూ కోడిగుడ్లను తింటుంటే ఫలితం ఉంటుంది. వీటిల్లో ఉండే కొవ్వులు బరువు పెరిగేందుకు సహాయం చేస్తాయి. కోడిగుడ్లను రోజూ ఉదయం తింటే మేలు జరుగుతుంది. చికెన్, మటన్ వంటి మాంసాహారాలను తింటుంటే ప్రోటీన్లు లభించి కండరాలు నిర్మాణమవుతాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. శనగలు, పప్పు దినుసులు, బీన్స్‌లోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని రోజూ తింటున్నా కూడా ఫలితం ఉంటుంది.
బరువు పెరిగేందుకు గాను సోయా టోఫు, పనీర్‌ను కూడా తినవచ్చు. వీటిల్లో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు బరువు పెరిగేలా చేస్తాయి. డైటిషియన్ సూచన మేరకు ప్రోటీన్ పౌడర్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నా ఫలితం ఉంటుంది. ఇవి శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, కొవ్వులు లభించేలా చేస్తాయి. దీంతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు. అలాగే అన్నం, ఆలుగడ్డలు, పిండి పదార్థాలు ఉండే కూరగాయలు, కినోవా, ఓట్స్, మొక్కజొన్న వంటి వాటిని రోజూ తింటుండాలి. బటర్, క్రీమ్ ఎక్కువగా ఉపయోగించాలి. కిస్మిస్లు, ఖర్జూరాలు, యాప్రికాట్స్, డార్క్ చాకొలెట్, స్మూతీలు, పీనట్ బటర్ వంటి వాటిని తింటుంటే బరువు పెరుగుతారు. అయితే బరువు పెరగాలని డైట్ చేసేవారు కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. లేదంటే శరీరంలో కొవ్వు అధికంగా చేరి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. కనుక ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలని కోరుకునే వారు కచ్చితంగా వ్యాయామం చేయాలి. అప్పుడే తగిన ఫలితం లభిస్తుంది.