Drishyam Director | కొత్తదనంతో కూడిన కథలతో ప్రేక్షకులకు థ్రిల్ అందించడంలో ఎప్పుడూ ముందుండే ఈ డైరెక్టర్ ఇటీవలే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. Mirage టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో అసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి హీరోహీరోయిన్లుగా నటించారు. కాగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది.
థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఇప్పుడు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం సోనీలివ్‌లో Mirage అందుబాటులో ఉంది. మలయాళం, తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో వీక్షించే వీలు కల్పించారు మేకర్స్. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం ఇంప్రెస్ చేసే అవకాశాలున్నాయంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఓటీటీలో ఈ మూవీ మరింత మంది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా.. ? అనేది చూడాలి.
నాడ్ స్టూడియోస్,, ఈ4 ఎక్స్పరిమెంట్స్, సరిగమ సెవెన్ 1 సెవెన్ ప్రొడక్షన్స్, బెడ్‌టైం స్టోరీస్ బ్యానర్లపై ముఖేశ్ ఆర్ మెహతా, జతిన్ ఎం సేతి,, సీవీ సారథి, విక్రమ్ మెహ్రా,, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విష్ణు శ్యామ్ మ్యూజిక్ అందించాడు.