Vishal | తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఒకరు విశాల్. ఈ టాలెంటెడ్ యాక్టర్ యువర్స్ ప్రాంక్లీ విశాల్ (Yours Frankly Vishal) పోడ్కాస్ట్తో రాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ప్రోమో కూడా విడుదల చేసిన విశాల్ పలు సమస్యలపై మాట్లాడాడు.
ఇందులోప్రత్యేకించి స్టంట్స్ చేస్తున్న సమయంలో డూప్స్ ని పెట్టడం గురించి మాట్లాడుతూ.. ఇప్పటిదాకా తాను డూప్‌ను చూడలేదు. నా శరీరంపై ఇప్పటిదాకా 119 కుట్లు పడ్డాయన్నాడు విశాల్. ఈ కామెంట్స్ నెట్టింట రౌండప్ చేస్తుండగా.. తాజాగా అవార్డుల గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
‘అవార్డులను నేనంతగా నమ్మను.. అవార్డు అనేది పనికిరాని విషయం.. ఎనిమిది కోట్ల మంది లేదా 80 కోట్ల మంది అనుకున్నది, ఇష్టపడేది కేవలం 8 మంది (అవార్డ్స్ కమిటీ మెంబర్స్) మాత్రమే నిర్ణయించలేరు. ఇది నేషనల్ అవార్డ్స్ కూడా వర్తిస్తుంది. ఇది కేవలం నేను అవార్డు పొందకపోవడం వల్ల మాత్రం చెప్పడం లేదు.. నా వరకు అవార్డుల కాన్సెప్ట్‌ను అంతగా నమ్మను. ఎవరైనా నాకు అవార్డు ఇస్తే.. దానిని చెత్తకుండిలో పడేస్తానన్నాడు’ విశాల్. విశాల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చర్చకు తీసేలా ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు
విశాల్ అవార్డ్స్ గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇలాంటి అభిప్రాయమే చెబుతూ.. నిజమైన గుర్తింపు అనేది ప్రేక్షకుల నుంచి వస్తుందన్నాడు.. ప్రేక్షకుల దీవెనల వల్లే తాను ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్టు చెప్పాడు.