Chandrayaan-2 | చంద్రుడిపై వాతావరణంపై సూర్యుడి ప్రభావం..! ఇస్రోకు కీలక సమాచారం పంపిన చంద్రయాన్-2..!
Chandrayaan-2 | చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. తాజాగా మరో కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
Chandrayaan-2 | చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. తాజాగా మరో కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. చంద్రుని ఎక్సోస్పియర్, వాతావరణం, ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ఈ సమాచారం సహాయపడుతుందని ఇస్రో పేర్కొంది. ఇస్రోకు చెందిన చంద్రయాన్-2 లూనార్ ఆర్బిటర్ అంతరిక్ష శాస్త్ర రంగంలో తొలిసారిగా ఈ సమాచారాన్ని సేకరించినట్లుగా వెల్లడించింది. చంద్రయాన్-2 లోని సాంకేతిక పరికరం అయిన ఛేస్-2 (CHACE-2) సూర్యుడి నుంచి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) చంద్రుడి ఎక్సోస్పియర్‌పై ప్రభావాన్ని పరిశీలించింది.
ఈ భారీ సౌర తుఫాను చంద్రుడిని తాకిన సమయంలో చంద్రుని పగటిపూట ఎక్సోస్పియర్‌లో మొత్తం పీడనం అకస్మాత్తుగా పెరిగిందని చంద్రయాన్-2 డేటా తెలిపింది. వాతావరణంలోని అణువులు, వాటి సాంద్రత పది రెట్లు ఎక్కువ పెరిగిందని ఛేస్-2 నమోదు చేసిందని ఇస్రో పేర్కొంది. ఈ సంఘటన 10 మే 2024న జరిగింది. ఈ సమయంలో సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్ల ప్రభావం చంద్రుడిపై పడినట్లుగా ఇస్రో పేర్కొంది. చంద్రుడికి భూమిలా అయస్కాంత క్షేత్రం, దట్టమైన వాతావరణం లేనందున ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ల వెలువడిన కణాలు నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టినట్లుగా పేర్కొంది. ఈ కణాల ప్రభావం వల్ల చంద్రుని ఉపరితలం నుంచి పెద్ద సంఖ్యలో అణువులు ఎక్సోస్పియర్‌లోకి వెళ్లాయని.. దాంతో అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితమైందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యుడి నుంచి వచ్చే శక్తి, పేలుడు అయిన కరోనల్ మాస్ ఎజెక్షన్లు (CMEs) చంద్రుడి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చంద్రయాన్-2 మొదటిసారిగా శాస్త్రీయంగా పరిశీలించిందని చెప్పింది.
ఇది చంద్రుడి ఎక్సోస్పియర్‌ను బాగా అర్థం చేసుకునేందుకు, ఉపరితలంపై అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 మిషన్‌ను జూలై 22, 2019న శ్రీహరికోట నుంచి GSLV-MkIII-M1 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మిషన్ ఎనిమిది శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్లి 20 ఆగస్టు 2019న చంద్ర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. విక్రమ్ ల్యాండర్‌తో 7 సెప్టెంబర్ 2019న సంబంధాలు కోల్పోయినప్పటికీ.. ఆర్బిటర్ ఇప్పటికీ 100 కి.మీ x 100 కి.మీ చంద్ర కక్ష్యలో తిరుగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు డేటాను సేకరించి ఇస్రోకు పంపుతుంది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని శాస్త్రవేత్తలు లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో చంద్రుడిపైకి పరిశోధనా కేంద్రాలను, మావన ఆవాసాలను ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్లు పెద్ద సవాల్‌గా నిలిచే అవకావం ఉందని.. వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందని ఇస్రో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

