ఢిల్లీలో ఆక్సిజన్ కొరత : సీఎం కేజ్రీవాల్
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత |

న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతానికి రోజుకు 700 టన్నులు అవసరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోటాను 378 టన్నులకు నుంచి 480 టన్నులకు పెంచిందని, అయినా ఇంకా చాలా అవసరమన్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి లేదని, ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా జరుగుతుందని తెలిపారు. పలు కంపెనీలు, ప్రభుత్వాలు ఢిల్లీకి సరఫరా నిలిపివేశాయన్నారు. మొదట తమ రాష్ట్రాల్లోనే ఆక్సిజన్ వినియోగించుకుంటామని చెప్పాయన్నారు.
ఢిల్లీ కోటాను కూడా ఉపయోగించుకుంటూ.. ట్రక్కులను ఢిల్లీకి రానివ్వడం లేదన్నారు. గత రెండు మూడు రోజులుగా కేంద్రం, ఢిల్లీ హైకోర్టు చొరవతో ఆక్సిజన్ సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన కోటా ప్రకారం ఒడిశా నుంచి ఆక్సిజన్ రావాల్సి ఉందని, ఇక్కడికి వచ్చేందుకు సమయం పడుతుందని, అవసరమైతే విమానం ద్వారా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధానిలో వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ఐక్యత చాటాలన్నారు.

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ ఐసీయూ పడకల కొరత ఉందని, ఈ మేరకు పడకలు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 7వేల పడకలను ఏర్పాటు చేయాలని కోరితే 2వేలు వచ్చాయని తెలిపారు. మూడు రోజులుగా తీవ్రమైన ఆక్సిజన్ సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు కేటాయించే కోటాను కేంద్రం పెంచిందని, అయినా అవసరం కంటే తక్కువగానే ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఆంజనేయుడు ఆంధ్రుడే
దంచికొట్టిన ఎండలు.. అత్యంత వేడి సంవత్సరం 2020
రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వానలు
వాతావరణ సంక్షోభంపై నేడు వర్చువల్ సమ్మిట్.. ప్రసంగించనున్న మోదీ
బెంగాల్లో ఆరో విడుత పోలింగ్ షురూ..
నేడు భారత్‌కు మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు
దేశంలో 24 గంటల్లో 3.15లక్షల కరోనా కేసులు.. 2,104 మరణాలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా?
హాస్పిటల్ నుంచి 1,710 కొవిడ్ వ్యాక్సిన్లు మాయం
పాట్నాలో రెండు టాప్ దవాఖానాల్లో 500 మందికి కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

