రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
రాజన్న ఆలయం | వేములవాడలోని రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల నడుమ

వేములవాడ కల్చరల్ : వేములవాడలోని రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం కొవిడ్ నిబంధనల మేరకు ఘనంగా జరిగింది. విశ్వక్షేణ పూజలో మొదలై ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రదాయ పద్దతిలో కల్యాణ తంతును ఆలయ అర్చకులు నిర్వహించారు. రాజన్న ఆలయం తరపున ఈవో కృష్ణప్రసాద్ ,మున్సిపల్ తరపున చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, రాజు, కమీషనర్ శ్యామ్ సుందర్‌లు స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారు.

ఉదయం 10.50 నిమిషాల నుండి 12.45 వరకు జరిగిన కల్యాణం అభిజిత్ లగ్నంలో నిర్వహించారు. హరిహర క్షేత్రమైన రాజన్న అలయంలో ఆలయ ప్రధానార్చకులు నమిలకొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వైష్ణవ పురోహితులు కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణంలో ఆచార్య దంపతులుగా మారంగంటి గిరిధరాచార్యులు, మాధవి దంపతులు వ్యవహరించారు. ఆలయంలో కల్యాణం జరుగుతున్నంత సేపు మెట్ల వద్ద శివపార్వతులు ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకుని తన్మయత్వంలో మునిగారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్, పర్యవేక్షకులు నటరాజ్, వారి నర్సయ్య, మహేష్, గోలి శ్రీను, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

