రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వానలు
తెలంగాణలో వానలు |

హైదరాబాద్ : రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ, మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి బుధవారం బలహీన పడిందని, దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షం కురిసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 29.3 మిల్లీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 28.3 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, ములుగు, జనగాం, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. మరో వైపు బుధవారం నల్లగొండ ఈఎస్ఎస్ కొండాపురం, కనగల్, పులిచెర్ల, కామారెడ్డిగూడెం, ఘన్‌పూర్‌లో 40.9 డిగ్రీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్ డీపీఎస్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఆంజనేయుడు ఆంధ్రుడే
దంచికొట్టిన ఎండలు.. అత్యంత వేడి సంవత్సరం 2020
రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

