Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కుంభవృష్టి (Heavy rain) కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలువడంతో చెరువులను తలపిస్తున్నాయి. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిపాల్పూర్ (Mahipalpur) ఏరియాలోని ఓ కూడలిలో వరదనీరు నిలువడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మహదేవ్ రోడ్, వీడీ మార్గ్, నోయిడా సెక్టార్ 11 తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం కుంభవృష్టి పడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ వెంటనే భారీగా వర్షం మొదలైంది. మహిపాల్పూర్ ఏరియాలో రోడ్లపై వరదనీరు నిలువడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi | Waterlogging in several parts of the National Capital following heavy rainfall.
(Visuals from Mahipalpur area) pic.twitter.com/QgV0Sy7ojx
— ANI (@ANI) June 17, 2025