Crime news | పెళ్లయిన 36 రోజులకే భర్తకు విషంపెట్టి చంపిన భార్య
Crime news | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) ని పెళ్లయిన 13 రోజులకే ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) హత్య చేయించిన ఘటనను మరువకముందే.. పెళ్లయిన 36 రోజులకే భర్తకు భార్య విషంపెట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Crime news : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) ని పెళ్లయిన 13 రోజులకే ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) హత్య చేయించిన ఘటనను మరువకముందే.. పెళ్లయిన 36 రోజులకే భర్తకు భార్య విషంపెట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ (Jarkhand) రాష్ట్రం గర్హ్వా జిల్లా (Garhwa district) లో గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రామ్చంద్రాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని విష్ణుపూర్ గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ కుమార్తె సునీతను.. మే 11న జార్ఖండ్ రాష్ట్రం గర్హ్వా జిల్లాలోని బహోకుందర్ గ్రామానికి చెందిన బుధ్నాథ్ సింగ్కు ఇచ్చి వివాహం చేశారు. అయితే వివాహం జరిగిన మరుసటి రోజే సునీత తనకు భర్త ఇష్టంలేదని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది.
దాంతో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేసి, సునీతకు నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. దాంతో శనివారం భర్తతో కలిసి మార్కెట్కు వెళ్లిన సునీత కూరగాయ చెట్లకు కొట్టాలనే సాకుతో పురుగులమందు కొనించింది. ఆదివారం రాత్రి దాన్ని భర్త తినే భోజనంలో కలిపి పెట్టింది. రాత్రి భోజనం తర్వాత నిద్రపోయిన బుధ్నాథ్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు.
కొడుకు మృతితో బుధ్నాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కోడలే కొడుకు తినే భోజనంలో విషం కలిపిందని ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీతను అదుపులోకి తీసుకున్నారు. బుధ్నాథ్ పోస్టుమార్టం నివేదిక వస్తే అతడి మరణానికి విషమే కారణమా.. లేదా.. అనే తేలుతుందని పోలీసులు తెలిపారు.
Read More >>
ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
పైలట్ సుమీత్ సభర్వాల్ అంత్యక్రియలు.. తండ్రి భావోద్వేగం.. Video
రాజా రఘువంశీ హత్యాస్థలంలో సీన్ రీ కన్స్ట్రక్షన్.. Video
కెమెరాలు చూస్తున్నాయ్.. గీత దాటితే వాత తప్పదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

