Airindia flight : అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిర్ఇండియా విమానం (Airindia flight) కూలిన ఘటనలో మరణించిన పైలెట్ సుమీత్ సభర్వాల్ (Sumeet Sabharwal) అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని ఆయన స్వగృహానికి సోమవారం రాత్రి సభర్వాల్ మృతదేహం చేరింది. మంగళవారం అంతిమ సంస్కారాలు చేశారు.
మంగళవారం ఉదయం సుమీత్ సభర్వాల్ భౌతికకాయాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకురాగానే ఆయన తండ్రి పుష్కరాజ్ భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకు మృతదేహాన్ని చూస్తూ విలపించారు. కాగా ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సుమీత్ సభర్వాల్ సహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం ఎయిర్‌పోర్టు సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో ఆ హాస్టల్లో ఉన్న వైద్యులు, సిబ్బందిలో కూడా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మంది ప్రమాదం జరిగిన రోజే మరణించగా.. చికిత్స పొందుతూ ఈ నాలుగైదు రోజుల్లో మరో 14 మృతిచెందారు. దాంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.
#WATCH | #AirIndiaPlaneCrash | Maharashtra: Father of Captain Sumeet Sabharwal, Pushkaraj pays emotional tribute to his son outside their residence in Powai, Mumbai.
Captain Sabharwal was flying the ill-fated London-bound Air India flight that crashed soon after take off in… pic.twitter.com/NStRiMM6BY
— ANI (@ANI) June 17, 2025