హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవం పేరు తో ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్ర హం గాంధీ కోసం కాదని, గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోట్ల కోసమని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి శనివారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. అందుకోసమే 13న హోటల్ తాజ్‌కృష్ణలో ‘మూసీ రిజువనేషన్ ఫేజ్-1’ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మూసీ ప్రాంతాన్ని అమ్మకానికి పెడుతారని సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ‘ఎవరికి ఎంత భూమి కావా లి? ఎవరు ఎంత వ్యాపారం చేస్తారు? ఎవరు ఎంత ఇస్తారు?’ అని సమావేశంలో రేవంత్ అడుగుతారని ఎద్దేవా చేశారు. పేదల ఇండ్లు కూలగొట్టి.. పెద్దల చేతిలో పెట్టి.. కమీషన్లు నొక్కేందుకే ఆహ్వానం పలుకుతున్నారని సతీశ్‌రెడ్డి విమర్శించారు.