బిచ్కుంద, మార్చి 7: కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని మై నారిటీ గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు బిచ్కుంద ఎస్సై రాజు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దావన్గిరికి చెందిన షేక్ ముజాహిద్(17) బిచ్కుంద మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నా డు.
ఈనెల 5న బిచ్కుందలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో గణితం పరీక్ష రాసి తిరిగివెళ్లలేదు. దీంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం కౌలాస్నాలా కాలువలో ఒక మృతదేహం కనిపించినట్టు స్థానికుల సమాచారం మేరకు ఎస్సై రాజు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి ముజాహిద్గా గుర్తించారు. మృతుడి మామ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.