Nivetha Thomas | యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ తెలుగులో వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఛాలెంజింగ్ పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే నివేదా థామస్ అద్భుతమైన నటనకి ఆమెకి బెస్ట్ ఫీమేల్ లీడ్ గా గద్దర్ అవార్డ్ దక్కింది. 35 చిన్న కథ కాదు అనే సినిమాతో ఈ అవార్డ్ దక్కించుకుంది నివేదా. అయితే అవార్డ్ కార్యక్రమానికి హాజరైన సమయంలో నివేదా లుక్ అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం నివేదా థామస్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు చూసి ఎందుకామె అంత బరువు పెరిగిందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు.
35 చిన్న కథ కాదు చిత్రంలో తల్లి పాత్ర కోసమే నివేదా థామస్ అప్పట్లో బరువు పెరిగిందని, ఇక తగ్గడం కష్టంగా మారిందని అంటున్నారు. ఆ పాత్రకు తన బాడీ ట్రాన్స్ ఫార్మ్ తో న్యాయం చేశానని కూడా గతంలో నివేదా బదులిచ్చింది. ఇక బరువు పెరగడానికి రీజన్ మాత్రం ఆ సినిమానే అని చెప్పుకొస్తున్నారు. మరి కొందరు నివేదాకి థైరాయిడ్ సమస్య ఉందని అందుకే అంత లావైందని అంటున్నారు. మరి దీనిపై నివేదా ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. భారీగా బరువు పెరగడం వల్లనో లేకుంటే ఇతర కారణాలో తెలియదు కాని నివేదా థామస్‌కి రెండేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా, అటు తమిళం, మలయాళం ఇండస్ట్రీలోనూ ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం తాను ఓల్డ్ లుక్‌లోకి మారేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది.
నివేదా థామస్ విషయానికి వస్తే ఆమె చెన్నైలో పుట్టి పెరిగింది. 2008 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. 2016లో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన జెంటిల్మెన్ చిత్రంతో నివేదా టాలీవుడ్ కు పరిచయం చేశారు. నాని – నివేదా థామస్ కాంబినేషన్ లో వచ్చిన ‘జెంటిల్ మెన్’, ‘నిన్ను కోరి’ చిత్రాలు వచ్చి అప్పట్లో బిగ్ హిట్ గా నిలిచాయి. జై లవ కుశ, 118, బ్రోచేవరెవరురా, వీ, వకీల్ సాబ్, శాకినీ డాకినీ వంటి చిత్రాల్లో నటింటి ప్రేక్షకులను అలరించింది. చివరిగా 35 చిన్న కథ కాదు అనే చిత్రంలో నటించి ఆకట్టుకుంది.