Meghalaya murder : హనీమూన్ మర్డర్ (Honeymoon murder) కేసులో మేఘాలయ పోలీసులు (Meghalaya police) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే గత వారం రోజులుగా నిందితులను విచారించి హత్యకు సంబంధించి పలు వివరాలు రాబట్టిన పోలీసులు.. ఇవాళ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య జరిగిన రోజు ఏ టైమ్‌కు ఏ ప్రదేశంలో ఏం జరిగింది..? నిందితులు ఎవరు ఏం చేశారు..? అనే వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోనున్నారు.
అందుకోసం ఇప్పటికే మేఘాలయ పోలీసు బృందాలు, ఫోరెన్సిక్ క్రైమ్ సీన్ యూనిట్ ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. కాసేపట్లో నిందితులను కూడా అక్కడి తీసుకొచ్చి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఘటన జరిగిన ప్రదేశం కొండలు, లోయలతో కూడి ఉన్నది కావడంతో పోలీసులకు సాయంగా మేఘాలయ ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా ఘటనా ప్రాంతానికి చేరింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజారఘువంశీ (29) ని మే 23న మేఘాలయలోని ఉత్తరఖాసీ హిల్స్‌లో దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని లోయలో పడేశారు. భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ, ప్రియుడి స్నేహితులు విశాల్, ఆకాశ్, ఆనంద్‌లు కుట్రచేసి ఈ హత్యకు పాల్పడ్డారు. నిందితులంతా ఇండోర్‌కు చెందినవారే. రాజ్కుశ్వాహ ఇండోర్‌లోనే ఉండి తతంగం నడిపించగా సోనమ్, విశాల్, ఆకాశ్, ఆనంద్‌లు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు.
ఆ తర్వాత నిందితులంతా వేర్వేరు రవాణా మార్గాల్లో ఇండోర్‌కు చేరుకున్నారు. రాజా, సోనమ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి సెర్చింగ్ చేపట్టిన పోలీసులకు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్ ఆచూకీ దొరకలేదు. దాంతో అనుమానించిన పోలీసులు ఆమె కాల్‌డేటా బయటికి తీయగా ప్రియుడు రాజ్‌కుశ్వాహతో ఎక్కువ ఫోన్లు మాట్లాడినట్లు తేలింది.
దాంతో రాజ్కుశ్వాహాను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర బయటపడింది. వెంటనే రాజ్ కుశ్వాహాను, అతడి స్నేహితులు విశాల్, ఆకాశ్, ఆనంద్‌లను పోలీసులు అరెస్ట్‌చేశారు. దాంతో అప్పటిదాకా ఇండోర్‌లోని ఓ అద్దె ఇంట్లో దాక్కున్న సోనమ్.. యూపీలోని ఘాజీపూర్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయింది. తనను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారని సోనమ్ కట్టుకథ చెప్పగా.. అప్పటికే విషయం తెలిసిన పోలీసులు ఆమెకు బేడీలు వేశారు.
#WATCH | Raja Raghuvanshi Murder Case | Meghalaya: A team of Forensic Crime Scene Unit arrives at Wei Sawdong Falls in Sohra.
SDRF and Police team have also reached the spot. Today, Meghalaya Police team, along with the accused persons, will reach here to conduct the crime… pic.twitter.com/baXZkM7ds0
— ANI (@ANI) June 17, 2025