F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
F-35 fighter jet | ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets) లో ఒకటైన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది.
F-35 fighter jet : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets) లో ఒకటైన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది. ఈ యుద్ధ విమానం బ్రిటన్ దేశానికి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రయిక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఆ హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ ఇటీవల ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది.
బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆ నౌకలోని యుద్ధ విమానం ఎఫ్-35 ఇంధనం తగ్గడంతో ఆదివారం తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని భావించారు. కానీ 48 గంటలు గడిచినా అదే ఎయిర్‌పోర్టులో ఉండటంతో ఈ ఫైటర్జెట్కు ఏదో మెకానికల్ ప్రాబ్లం వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సర్వీసు చేయించి తిరిగి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఈ ఫైటర్జెట్కు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నది. మన దేశంలో ఓ విదేశీ యుద్ధ విమానం రెండ్రోజులపాటు నిలిచిపోవడం, అందులోనూ ఎఫ్-35 లాంటి 5వ తరం స్టెల్త్జెట్ మోరాయించడం సాధారణ విషయం కాదు. ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీనిలోనే మరో వేరియంట్ విమానాన్ని ఇరాన్‌పై దాడులకు వాడుతున్నది.
Read More >>
పైలట్ సుమీత్ సభర్వాల్ అంత్యక్రియలు.. తండ్రి భావోద్వేగం.. Video
రాజా రఘువంశీ హత్యాస్థలంలో సీన్ రీ కన్స్ట్రక్షన్.. Video
కెమెరాలు చూస్తున్నాయ్.. గీత దాటితే వాత తప్పదు
ఒకప్పుడు స్లిమ్‌గా ఉండే నివేదా థామస్ ఎందుకింత లావు అయింది.. సమస్య ఏంటి?
మోడల్ శీతల్‌ను చంపింది బాయ్‌ఫ్రెండ్.. 80 కిలోమీటర్ల దూరం కొట్టుకెళ్లిన మృతదేహం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

