Panneerselvam : మాజీ ముఖ్యమంత్రి (Former CM) జయలలిత (Jayalalita) మరణం తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే (AIADMK) వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని తమిళనాడు (Tamil Nadu) మరో మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం (O Panneerselvam) అన్నారు. జయ లలిత జయంతి సందర్భంగా మెరీనాబీచ్ కామరాజర్ రోడ్డులో ఉన్న ఆమె విగ్రహానికి పన్నీర్ సెల్వం నివాళులు అర్పించారు. తన అనుచరులతో కలిసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా మళ్ళీ జయ పాలన రావాలని కోరుకుంటున్నారని, ఆమె బ్రతికున్నంతకాలం పార్టీని ఉన్నతస్థితికి చేర్చారని అన్నారు. ఆ తర్వాత పార్టీలో ద్వంద్వ నాయకత్వం ఉన్నప్పుడు బలం బాగా పుంజుకుందని చెప్పారు. ఇప్పుడు ఏక నాయకత్వం వచ్చినప్పటి నుంచి పార్టీ ప్రతిష్ట క్రమంగా తగ్గుతూ వస్తోందని అన్నారు.
అన్నాడీఎంకే పార్టీలోని సీనియర్ నేతలంతా పార్టీ నాశనమైనా పరవాలేదుగానీ ఏక నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారని, ఇది మంచిది కాదని పన్నీర్ సెల్వం చెప్పారు. పార్టీలో నిరంకుశధోరణి పెరుగుతోందని ఆరోపించారు. పార్టీ నుంచి విడిపోయినవారిందరినీ కలుపుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే అన్నాడీఎంకే గెలిచి అధికారంలోకి వస్తుందని అన్నారు. అయితే ఆ దిశగా పార్టీ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గర్హనీయమని ఓపీఎస్ వ్యాఖ్యానించారు.
ఓపీఎస్ వ్యాఖ్యలను పళనిస్వామి తిప్పికొట్టారు. ‘తోడేలు, గొర్రె పిల్ల కలిసి సాగుచేస్తే మంచి పంట దిగుబడి వస్తుందా..? నమ్మకస్తుడు, రాజద్రోహి ఒకేచోట ఉండగలరా..? మీరు చెప్పింది జరగడం అసాధ్యం’ అని పన్నీర్ సెల్వం పేరును ప్రస్తావించకుండా పళని స్వామి వ్యాఖ్యానించారు. అందుకు పన్నీర్ సెల్వం కూడా పళనిస్వామి పేరును ప్రస్తావించకుండానే.. జయలలితకు అత్యంత నమ్మకస్తుడిని తానేనని, అసలు అన్నాడీఎంకే తనదే అవుతుందని, నీ నయవంచన ఎక్కువకాలం సాగదని కౌంటర్ ఇచ్చారు.
Fresh snowfall | గుల్మార్గ్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆహ్లాదం పంచుతున్న మంచు వర్షం.. Video
Murders | ఒకరి తర్వాత ఒకరిని సుత్తితో తలలపై కొట్టి.. ఐదుగురు కుటుంబసభ్యుల దారుణ హత్య..!
Sajjan Kumar | తండ్రీ కొడుకులను తగులబెట్టిన కేసు.. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు
Manchu Vishnu | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు..Video
Gulkand | మీకు గుల్కండ్ గురించి తెలుసా..? దీన్ని రోజూ తింటే.. ఎన్నో లాభాలు..!
Ranjana Nachiyaar | త్రిభాషా సూత్రం తప్పు.. బీజేపీకి తమిళ నటి రాజీనామా
Encounter | పంజాబ్‌లో ఎన్కౌంటర్.. దుండగుల కాళ్లలోకి దూసుకెళ్లిన పోలీస్ బుల్లెట్లు.. Video