Gulkand | మనకు ఆరోగ్యాన్ని అందించే ఆహారాలు మన చుట్టూనే ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి ఆహారాల గురించి చాలా మందికి తెలియదు. వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ఆహారాల్లో గుల్కండ్ కూడా ఒకటి. చాలా మందికి దీని గురించి తెలియదు. కానీ స్వీట్ పాన్ తినేవారికి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే స్వీట్ పాన్‌లో గుల్కండ్‌ను కూడా వేస్తారు. ఇది ఎంతో తియ్యగా, అద్బుతమైన రుచిని కలిగి ఉంటుంది. వాస్తవానికి మనకు గుల్కండ్ నేరుగా తినేందుకు కూడా లభిస్తుంది. కానీ దీని గురించి చాలా మందికి తెలియకపోవడం వల్ల దీన్ని ఎవరూ తినడం లేదు. ఇది చాలా అద్భుతమైన ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గులాబీ పువ్వుల రెక్కలతో గుల్కండ్‌ను తయారు చేస్తారు. దీనికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. కనుక దీన్ని వేసవిలో ఎక్కువగా తింటుంటారు. ఇక చాలా చోట్ల లస్సీ, ఫాలూదా వంటి పానీయాల తయారీలోనూ కొందరు గుల్కండ్‌ను వాడుతుంటారు. ఈ క్రమంలోనే గుల్కండ్‌ను తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుల్కండ్‌ను కేవలం ఒక టీస్పూన్ మోతాదులోనే తినాల్సి ఉంటుంది. దీనికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. కనుక ఎండలో తిరిగి వచ్చిన వారు వేడి చేయకూడదు అనుకుంటే ఒక టీస్పూన్ గుల్కండ్‌ను తినాలి. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు, వేడిని తగ్గించుకునేందుకు కూడా దీన్ని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.
గుల్కండ్ లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. గుల్కండ్‌ను తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం పోరాడుతుంది. మన జీర్ణ వ్యవస్థకు గుల్కండ్ ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రోబయోటిక్ ఆహారాల జాబితా కిందకు వస్తుంది. అందువల్ల దీన్ని తింటే జీర్ణక్రియ మెరుగు పడడంతోపాటు జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
గుల్కండ్‌ను తింటే నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మైండ్‌ను రిలాక్స్ చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మూడ్ మారుతుంది. ఆందోళనగా ఉండే వారు హ్యాపీగా మారిపోతారు. గుల్కండ్‌ను రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తింటున్నా చాలు.. రక్తం శుద్ధి అవుతుంది. కిడ్నీల్లోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోయి కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుల్కండ్‌ను సాయంత్రం సమయంలో సేవించడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరూ మంచి మూడ్ లోకి వస్తారు. దీంతో వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంపై ఆసక్తి కలుగుతుంది. ఇలా గుల్కండ్‌ను సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.