Encounter : పంజాబ్ (Punjab) లో పోలీసులకు, దుండగుల (Miscreant) కు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో దుండుగులిద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ముందుగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులకు చికిత్స కొనసాగుతోందని, ఘటనపై కేసు నమోదు చేసి తుదపరి దర్యాప్తు చేపడుతామని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం తారన్ తరన్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో నిందితులుగా ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఖేమ్ కరన్ ఏరియాలో పోలీసులకు నిందితులు తారసపడ్డారు. దాంతో పోలీసులు వారిని లొంగిపోవాలని హెచ్చరించగా.. దుండగులు పోలీసులపై కాల్పులు జరుపుతూ బైక్పై పారిపోయేందుకు ప్రయత్నించారు.
దాంతో పోలీసులు ఆ దుండగులను సినీ ఫక్కీలో వెంబడిస్తూ కాల్పులు జరిపారు. దుండగుల కాళ్లపై గురిపెట్టి కాల్చారు. దాంతో ఇద్దరి కాళ్లలోకి పోలీస్ బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయారు. అనంతరం పోలీసులు నిందితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నారు.
#WATCH | Tarn Taran, Punjab: Two miscreants were shot in the leg during an encounter by Punjab Police in Khem Karan.
As per Ajay Raj, SP Investigation Tarn Taran Singh, “Two miscreants named Prakash Singh and Prabhjeet Singh were injured… They were involved in two recent… pic.twitter.com/5kBHe874YR
— ANI (@ANI) February 25, 2025