Manchu Vishnu : ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) పెద్ద కుమారుడు, కన్నప్ప సినిమా (Kannappa Cinema) హీరో మంచు విష్ణు (Manchu Vishnu) మంగళవారం తిరుమల (Tirumala) శ్రీవారి (Lord Venkateshwara) ని దర్శించుకున్నారు. నటుడు శివబాలాజీ (Actor Shiva Balaji) తదతరులతో కలిసి ఆయన తిరుపతికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్న సమయంలో ఆయన, శివ బాలాజీ, మరో నటుడు కన్నప్ప సినిమా కాస్ట్యూమ్స్లోనే ఉన్నారు.
ముందుగా తిరుమలకు చేరుకున్న మంచు విష్ణుకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం మంచు విష్ణు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వర స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు. కాగా విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#WATCH | Andhra Pradesh | ‘Kannappa’ movie star Vishnu Manchu, along with actor Siva Balaji, visited Tirumala today to receive Lord Venkateswara’s blessings. pic.twitter.com/e5DaCZHrNL
— ANI (@ANI) February 25, 2025
Gulkand | మీకు గుల్కండ్ గురించి తెలుసా..? దీన్ని రోజూ తింటే.. ఎన్నో లాభాలు..!
Ranjana Nachiyaar | త్రిభాషా సూత్రం తప్పు.. బీజేపీకి తమిళ నటి రాజీనామా
Encounter | పంజాబ్లో ఎన్కౌంటర్.. దుండగుల కాళ్లలోకి దూసుకెళ్లిన పోలీస్ బుల్లెట్లు.. Video