Murders : రానురాను మానవసంబంధాలు (Human relations) మంటగలిసిపోతున్నాయి. చిన్నచిన్న విషయాలకే భౌతిక దాడుల (Physical attacks) కు, ఏకంగా హత్యల (Murders) కు పాల్పడుతున్నారు. సొంత కుటుంబసభ్యులను సైతం అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. తాజా కేరళ రాష్ట్రం (Kerala state) తిరువనంతపురం (Thiruvananthapuram) జిల్లాలోని వెంజరమూడు (Venzaramoodu) ప్రాంతంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల వ్యక్తి సుత్తితో తన కుంటుంబంలోని ఆరుగురి తలలు పగులగొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. అఫన్ అనే వ్యక్తి వెంజరమూడులో తన తల్లి షెమీ (Shemi), సోదరుడు అహ్సాన్ (Ahsan) తో కలిసి ఉంటున్నాడు. ఆయన తండ్రి విదేశాల్లో స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేస్తున్నాడు. వెంజరమూడుకు 25 కిలోమీటర్ల దూరంలోని పాన్గోడ్ గ్రామంలో అఫన్ తన నానమ్మ సల్మా బీవీ (Salma Beevi) ఉంటోంది. పాన్గోడ్కు నాలుగు కిలోమీటర్ల దూరంలోని కూనన్వెంగలో అతడి బాబాయ్ లతీఫ్ (Lateef), పిన్ని షాహిదా (Shahida) ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అఫన్ పాన్గోడ్లోని తన నానమ్మ ఇంటికి వెళ్లి ఆమె తలపై సుత్తితో కొట్టి చంపాడు.
అక్కడి నుంచి కూనన్వెంగలోని తన బాబాయ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ బాబాయ్ లతీఫ్‌ను, పిన్ని షాహిదాను సుత్తితో తలుల పగులగొట్టి హత్యలు చేశాడు. బాబాయ్‌ను సోఫాలో కూర్చుని ఉండగా.. పిన్నిని కిచెన్‌లో వంట చేస్తుండగా చంపేశాడు. ఆ తర్వాత మార్గమధ్యలో తన గర్ల్‌ఫ్రెండ్ ఫర్సానా (Farsana) ను, స్కూల్ నుంచి 9వ తరగతి చదువుతున్న తన సోదరుడు అహ్సాన్ను తీసుకుని వెంజరమూడులోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న ఫర్సానా ముఖంపై సుత్తితో కొట్టిచంపాడు. దాంతో ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది.
ఆ తర్వాత తల్లిని, సోదరుడిని కూడా సుత్తితో తలలపై కొట్టాడు. సోదరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత తను కూడా విషం సేవించాడు. అనంతరం నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాను తన కుటుంబంలోని ఆరుగురిని హత్య చేశానని వారికి తెలిపాడు. దాంతో పోలీసులు హుటాహుటిన మూడు ప్రదేశాల్లోకి వెళ్లారు. అఫన్ నానమ్మ, బాబాయ్, పిన్ని, గర్ల్ ఫ్రెండ్, సోదరుడి మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టానికి పంపించారు. తీవ్రంగా గాయపడిన అఫన్ తల్లిని, విషం సేవించిన అఫన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. కాగా అఫన్ తండ్రి స్పేర్ పార్ట్స్ వ్యాపారంలో నష్టపోయాడని, ఇటీవలే అతడు ఇండియాకు వచ్చి విజిటింగ్ వీసాపై మళ్లీ విదేశాలకు వెళ్లాడని, అప్పుల కారణంగా కుటుంబసభ్యులంతా కలిసి విషం సేవించి చనిపోవాలని నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో అఫన్ ఈ హత్యలకు ఒడిగట్టాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అందరూ కలిసి విషం తాగితే కొందరు బతికి ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, అందుకే అందరినీ తానే హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని స్పృహ కోల్పోయే సమయంలో అఫన్ చెప్పినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం అఫన్ స్పృహలో లేడని, అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత హత్యలకు కచ్చితమైన కారణం అదేనా, కాదా అనే విషయం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. తండ్రి అప్పులు చేశాడని, తనకు ఏం చేయాలన్నా డబ్బులు లేని పరిస్థితి కల్పించాడని అఫన్ కోపంతో ఉండేవాడని అతని సమీప బంధువు ఒకరు చెప్పారు. అంతేగాక అఫన్ తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు.
#WATCH | Thiruvananthapuram, Kerala | 23-year-old man allegedly kills five people, including brother, grandmother, uncle, aunt and girlfriend. Kerala Minister G.R. Anil visits the crime scene pic.twitter.com/GyRYfkk7om
— ANI (@ANI) February 25, 2025