మైక్రోవేవ్‌లు సిద్ధం చేసుకోండి
ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రయాణికుల కోసం మైక్రోవేవ్, ఇండక్షన్ ప్లేట్లకు మారి రెడీ టు ఈట్ ఆహార పదార్థాల నిల్వలను సమృద్ధిగా ఉంచుకోవాలని రైల్వే స్టేషన్లలోని తన క్యాటరింగ్ యూనిట్లను ఐఆర్సీటీసీ ఆదేశించింది.
- క్యాటరింగ్ యూనిట్లకు ఐఆర్సీటీసీ ఆదేశం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రయాణికుల కోసం మైక్రోవేవ్, ఇండక్షన్ ప్లేట్లకు మారి రెడీ టు ఈట్ ఆహార పదార్థాల నిల్వలను సమృద్ధిగా ఉంచుకోవాలని రైల్వే స్టేషన్లలోని తన క్యాటరింగ్ యూనిట్లను ఐఆర్సీటీసీ ఆదేశించింది. నిరంతరాయంగా క్యాటరింగ్ సేవలు అందజేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు మారాలని ఫుడ్ ప్లాజాలు, జన్ ఆహార్ల నిర్వాహకులకు మంగళవారం జారీచేసిన ఓ నోటీసులో సూచించింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడవచ్చన్న వార్తల నేపథ్యంలో ఐఆర్సీటీసీ నుంచి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు మైక్రోవేవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లు వంటి ప్రత్యామ్నాయ వంట పద్ధతులకు మారలని సంస్థ సూచించింది. ప్రయాణికుల డిమాండుకు అనుగుణంగా వండిన ఆహార పదార్థాలతోపాటు ప్రమాణాలతో కూడిన ప్యాకేజ్డ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలను సమృద్ధిగా నిల్వ చేసుకోవాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

