బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు ఖాయం!
అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం 12వ రోజుకు చేరిన క్రమంలో గ్లోబల్ చమురు మార్కెట్ తీవ్ర కుదుపునకు లోనవుతున్నది. ఈ క్రమంలో చమురు ఉత్పత్తి, ధరలపై ప్రపంచ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
- సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్, మార్చి 11: అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం 12వ రోజుకు చేరిన క్రమంలో గ్లోబల్ చమురు మార్కెట్ తీవ్ర కుదుపునకు లోనవుతున్నది. ఈ క్రమంలో చమురు ఉత్పత్తి, ధరలపై ప్రపంచ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారీ స్థాయిలో పెరిగే చమురు ధరలకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని మిలిటరీ కమాండ్ పేర్కొన్నది. ‘సిద్ధంగా ఉండండి.. చమురు బ్యారెల్ ధర 200 డాలర్లు కానుంది. ఎందుకంటే చమురు ధరలు ప్రాంతీయ భద్రత మీద ఆధారపడి ఉన్నాయి. అయితే అది ఇప్పుడు అస్థిరంగా ఉంది’ అని ఇరాన్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫకరీ నేరుగా అమెరికాను ఉద్దేశించి హెచ్చరించారు. ప్రస్తుతానికి అమెరికా, ఇజ్రాయెల్‌పై పరిమితంగా చేస్తున్న ప్రతీకార దాడులను నిరంతర దాడులుగా మారుస్తామని అన్నారు. కాగా, ఇప్పటికే హొర్ముజ్ జలసంధిపై వాణిజ్య నౌకలను నిలిపివేసిన ఇరాన్, తాజాగా పర్షియన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు ప్రారంభించింది. తద్వారా ప్రపంచ దేశాలకు చమురు రవాణా కాకుండా అడ్డుకోవాలని భావిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

