శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 14, 2020 , 03:00:20

అర్జున్‌ రాంపాల్‌పై ప్రశ్నల వర్షం

అర్జున్‌ రాంపాల్‌పై ప్రశ్నల వర్షం

ముంబై, నవంబర్‌ 13: మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) కేసులో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ను నార్కోటిక్‌ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. దక్షిణ ముంబైలోని నార్కోటిక్‌ కార్యాలయానికి వచ్చిన ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకంపై ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే అధికారులు అర్జున్‌ రాంపాల్‌ మిత్రుడు, విదేశీయుడు పాల్‌ గియార్డ్‌ను అరెస్టు చేశారు. అంతేగాక రాంపాల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గాబ్రియెల్లాను ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడం.. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకం వెలుగులోకి రావడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.