e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ : ఒక రోజు తర్వాత ఇంధన ధరలు ఆదివారం మళ్లీ పెరిగాయి. ఇంతకు ముందు శుక్రవారం ధరలు పెరగా.. శనివారం పెరుగలేదు. ఒక రోజు తర్వాత మళ్లీ ధరలు పైకి కదిలాయి. అంతకు ముందు బుధవారం ధరలు పెంచాయి. రోజు విడిచి రోజు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 30 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.58, డీజిల్‌ రూ.రూ.83.22కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.98.88, డీజిల్‌ రూ.90.04, చెన్నైలో పెట్రోల్‌ రూ.94.34, డీజిల్‌ రూ.88.07, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.92.67, డీజిల్‌ రూ.86.06, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.21, డీజిల్‌ రూ.90.73కి చేరాయి. ఇప్పటి వరకు నెలలో తొమ్మిది సార్లు పెట్రోల్‌ రేట్లు పెరిగాయి. తాజా పెరు‌గు‌ద‌లతో దేశ‌వ్యా‌ప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.103.52, డీజిల్‌ రూ.95.99కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని అనొపురలో పెట్రోల్‌ రూ.103.21, రెవాలో రూ.102.85, ఇండోర్‌, భోపాల్‌లో రూ.100 వంద దాటింది.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
టీఎస్ పీఈసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మ‌రోసారి పొడిగింపు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ట్రెండింగ్‌

Advertisement