శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 20:43:20

భారీగా పీపీఈ కిట్లు ఉత్ప‌త్తి చేసేందుకు నెవీకి అనుమ‌తి

భారీగా పీపీఈ కిట్లు ఉత్ప‌త్తి చేసేందుకు నెవీకి అనుమ‌తి

న్యూఢిల్లీ:  భార‌త నావికాద‌ళం అభివృద్ధి చేసిన పీపీఈ( ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌) కిట్లు ఉత్ప‌త్తికి క్లియ‌రెన్స్ అభించింది. దీనికి సంబంధించిన స‌ర్టిఫికేష‌న్ పూర్త‌యింద‌ని నావికాద‌ళం అధికారులు తెలిపారు. దీనితో పాటు భారీగా పీపీఈ కిట్ల ఉత్ప‌త్తికి అనుమ‌తి అభించింది. ఢిల్లీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిక‌ల్ అండ్ అలైడ్ సైస్స‌స్ పీపీఈ కిట్ల‌ను ప‌రీక్షించింది. డీఆర్‌డీవో కూడా పీపీఈ కిట్ల‌ను ప‌రీక్షించి దృవీక‌ర‌ణ ప‌త్రం అంద‌జేసింది. దీంతో పీపీఈ కిట్ల భారీ ఉత్ప‌త్తికి మార్గం సుగ‌మ‌మైంది. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి త‌రుముకొస్తున్న త‌రుణంలో పీపీఈ కిట్ల కొర‌త తీవ్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. పీపీఈ కిట్ల కొర‌త కోవిడ్ యుద్ధంలో పోరాడుతున్న‌ వైద్య, ఆరోగ్య సిబ్బంది మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ‌తీస్తుంది. వైర‌స్ బాధితులు ప‌రీక్షించ‌డానికి నాణ్య‌మైన ప్ర‌మాణాల‌తో కూడిన పీపీఈ కిట్లు అవ‌స‌రం. దీని ప్ర‌మాణాల‌ను ఐసీఎంఆర్‌, కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ నిర్ధేశిస్తాయి. ముంబైలోని ఇన్నోవేష‌న్ సెల్‌, ఇనిస్టిట్యూట్ ఆఫ్ నావ‌ల్ మెడిసిన్,  ముంబైలోని నావ‌ల్ డాక్యార్డ్ బృదం పీపీఈ కిట్ల రూప‌క‌ల్ప‌న‌, ఉత్ప‌త్తికి స‌హ‌క‌రించింది. 


logo