తన్వి.. చిన్నారి కవయిత్రి!

లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వాడుకున్నారు. కొందరు కుటుంబంతో గడిపేందుకు వెచ్చిస్తే.. మరికొందరు కొత్తకొత్త విషయాలు తెలుసుకొనేందుకు కేటాయించారు. పిల్లల గురించి చెప్పేదేముంది? ఆటపాటల్లో మునిగిపోయారు. కానీ, అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డ తన్వీరెడ్డి (10) మాత్రం తనకు ఇష్టమైన కవిత్వంపై మనసు పెట్టింది. తను రాసిన కవితల్ని ‘ఫ్రమ్ ది ఇన్సైడ్ ది ఇన్నర్ సోల్ ఆఫ్ ఎ యంగ్ పొయిట్’ పేరుతో పుస్తకం వేయించి మార్కెట్లో విడుదల చేసింది. తన రచనల్లో ప్రేమ, కృతజ్ఞతా భావం, ఆనందం.. తదితర పాజిటివ్ ఉద్వేగాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది తన్వి. మార్చి 15న విడుదలైన ఈ పుస్తకానికి భారీ స్పందన రావడంతో, అటు అమెరికాలో.. ఇటు ఇండియాలో తన్వి పేరు మారుమోగుతున్నది. ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్ ఐదింటికి 4.9 రేటింగ్ ఇచ్చింది. అమెరికాలోని ఆరిజోనాలో నివసిస్తున్న తన్వి తల్లిదండ్రులు దీపిక, మహేందర్ ఇద్దరూ ఇంజినీర్లే. తాతయ్య హనుమంతరెడ్డి కరీంనగర్ డెయిరీ సలహాదారు. త్వరలోనే అమెరికా, భారత్‌లలో పిల్లలు ఎదుర్కొనే సమస్యలపై మరో పుస్తకం రాస్తానని చెబుతున్నది తన్వి. తనకు హ్యారీపోటర్ కథలంటే ప్రాణమట.
ఇవి కూడా చదవండి:
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- poet
- tanvi reddy
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

