వ్యాక్సిన్ డైట్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సమస్యలను నియంత్రించడానికి ఏమైనా స్పెషల్ డైట్ ఉందా?
-సుమ, వరంగల్
కొవిడ్ టీకా వేసుకున్నాక కొంతమందిలో జ్వరం, కండరాల నొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి ‘బ్యాలెన్స్డ్ ఇన్ఫ్లమేటరీ డైట్’ను పాటించాలి. వ్యాక్సిన్ తర్వాత సూప్స్ తీసుకోవాలి. వ్యాక్సిన్ ప్రభావంతో శరీరంలో వేడి పెరిగి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెప్తుంటారు. నీళ్లు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే వేడి తగ్గుతుంది. సూప్‌ని ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ హైడ్రేటింగ్ ఫుడ్’గా చెప్పొచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నాక జలుబు చేస్తే.. పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి చేసిన కాళ్ల షోర్వ, చికెన్ సూప్ తాగితే ఉపశమనం ఉంటుంది. కాళ్ల షోర్వలోని ైగ్లెసిన్, ఆర్జినైన్ వంటి అమైనో యాసిడ్స్ శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. శాకాహారులు క్యారెట్, బీన్స్, పాలకూర, బ్రకోలీ, క్యాప్సికమ్, పుట్టగొడుగు సూప్ తాగొచ్చు.
డైట్ చార్ట్
- ఉదయం 6 గంటలకు : నానబెట్టిన ఐదు బాదం గింజలు, కొన్ని ఎండుద్రాక్షలు, అల్లం-నిమ్మగడ్డితో చేసిన చాయ్
- 8 గంటలకు : కివీ పండు, జీలకర్ర+పచ్చిమిర్చి+పుదీనా ఆహారం
- 11 గంటలకు: పసుపు, మిరియాల పొడితో చేసిన క్యారెట్+టమాటా సూప్
- మధ్యాహ్నం 1 గంటకు: నిమ్మరసంతో సలాడ్, అవిసె గింజల పొడి+ కప్పు బ్రౌన్ రైస్, ఆకుకూర పప్పు, జీలకర్ర పొడి వేసిన మజ్జిగ, అల్లం+కొత్తిమీర తరుగు, కూరగాయలతో కూర
- మధ్యాహ్నం 3:30కి : రెండు వాల్నట్స్, ఒక టీ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, రెండు ఖర్జూరాలు, ఒక గ్లాస్ పుచ్చకాయ రసం.
- సాయంత్రం 5:30కి : దానిమ్మ గింజలు, గుమ్మడి గింజలు
- రాత్రి 7:30కి : నిమ్మరసంతో మొలకల సలాడ్, కూరగాయలు+పప్పుతో చిరుధాన్యాల కిచిడి
- నిద్రకు ముందు : పసుపు కలిపిన గోరువెచ్చని పాలు

మయూరి ఆవుల,
న్యూట్రీషనిస్ట్,
www.trudiet.in
ఇవి కూడా చదవండి:
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

