ఆర్మూర్.. షాన్‌దార్!
ఆర్మూర్ చీర | ఆర్మూర్ చీర అనగానే.. రెండు ఇంచుల వెడల్పుతో, మూడుగీతల అంచు గుర్తుకొస్తుంది. ఈ చీరలను ట్రెండ్‌కు తగ్గ డిజైన్లతో నేటితరానికి అందించేందుకు

ఆర్మూర్ చీర అనగానే.. రెండు ఇంచుల వెడల్పుతో, మూడుగీతల అంచు గుర్తుకొస్తుంది. ఈ చీరలను ట్రెండ్‌కు తగ్గ డిజైన్లతో నేటితరానికి అందించేందుకు చేనేతశాఖ సిద్ధమైంది. సిల్క్ జరీతో చీర కొంగు, బార్డర్‌పై అందమైన డిజైన్, మధ్యలో బూటాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో పట్టు చీరను తలపించేలా ఆర్మూర్ చీర ముస్తాబు అవుతున్నది.
తెలంగాణ చేనేత శాఖ మార్కెట్ ట్రెండ్‌కు తగ్గట్టు వ్యూహాన్ని మార్చుకుంటున్నది. ఆడపడుచుల ఆసక్తికి పెద్దపీట వేస్తున్నది. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఆర్మూర్ చీరలను ప్రత్యేక డిజైన్లలో అందించేందుకు సిద్ధమవుతున్నది. సిల్క్ జరీతో చీర కొంగు, బార్డర్‌పై అందమైన డిజైన్, మధ్యలో బూటాలు వచ్చేలా రూపొందిస్తున్నారు. నిజాం కాలంనాటి షేర్వానీ, కోట్లపై జరీ దారంతో వేసే షాన్‌దార్ అల్లికలతో హిమ్రూ చీరలను తీసుకురానున్నది. ఈ ప్రాజెక్టు కోసం వరంగల్ అర్బన్ జిల్లాను ఎంచుకున్నది.
చేనేత దినోత్సవం (ఆగస్టు 12) నాటికి ఆర్మూర్, హిమ్రూ చీరలను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇందుకు రూ.9 లక్షలతో తమిళనాడు నుంచి 4 జకార్డ్ లూమ్స్ కొనుగోలుకు ఆర్డర్ చేశారు. ఆర్మూర్ చీరల తయారీపై ఎల్కతుర్తి మండలంలోని సూరారంలో, హిమ్రు చీరల తయారీపై కమలాపూర్‌లో పద్నాలుగు మంది మహిళలకు, ఆరుగురు పురుషులకు శిక్షణ ఇస్తున్నారు. ‘చేనేత చీరలపై మహిళల అంచనాలకు తగినట్టుగానే చీరల డిజైన్లు ఉంటాయి’ అని భరోసా ఇస్తున్నారు వరంగల్ జిల్లా చేనేత శాఖ అడిషనల్ డైరెక్టర్ రాఘవరావు.
… తౌటి కామేశ్వర్, వరంగల్
ఇవి కూడా చదవండి:
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

