e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home జాతీయం జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఇవాళ ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ములోని అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, కశ్మీర్‌ పోలీసులు ఉమ్మడిగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు బృందంపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మృతిచెందారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. వారు ఏ సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం భద్రదళాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయని చెప్పారు.

షోపియాన్‌ జిల్లాలో కూడా ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. షోపియాన్‌లోని మసీదులో నక్కిన టెర్రరిస్టుల భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సెక్యూరిటీ ఫోర్స్‌ జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు మసీదులోనుంచి కాల్పులు జరుపుతున్నారని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేసిన ఫిలిప్పీన్స్‌
పాకిస్థాన్‌కు ప్ర‌త్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : ర‌ష్యా
రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో క‌రోనా క‌ల‌క‌లం
30 ఏండ్ల గోళ్ల బంధం ముగిసింది!
మద్యం మత్తు, ఆపై అతివేగం.. లంగర్‌హౌస్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు
మాల్దీవుల్లో బికీనీతో ర‌చ్చ చేస్తున్న జాన్వీ క‌పూర్
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా

Advertisement
జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement