సువేందు అధికారికి ఈసీ నోటీసులు
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ కమిటీ నేత కవితా కృష్ణన్ ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసు ఇచ్చింది.

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ కమిటీ నేత కవితా కృష్ణన్ ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసు ఇచ్చింది. ఆయనకు ఈసీ నోటీసు ఇవ్వడం ఇది రెండోసారి. నందిగ్రామ్‌లో మార్చి 29న జరిగిన బహిరంగ సభలో సువేందు అధికారి ‘ద్వేషపూరిత ప్రసంగం’ చేశారని సీపీఐ నేత ఆరోపించారు. తన ప్రసంగంలో ‘బేగం’ అని ప్రస్తావించారని, అలాగే తన ప్రత్యర్థికి ఓటు వేస్తే ‘మినీ పాకిస్థాన్’కు ఓటు వేయడమేననని, భారతీయ పురాణాల్లోని ‘తామర’ గురించి సైతం ప్రస్తావిస్తూ.. ‘తామర పువ్వు గుర్తుకు ఓటేయండి’ అన్నట్లు నోటీసుల్లో ఈసీ పేర్కొంది. ఈ మేరకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌కు ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయంలో తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయింది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఇరుపార్టీల ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సువేందు అధికారి ఈ సారి బీజేపీ గూటికి చేరారు. ఈ సారి సీఎం మమతా బెనర్జీ సైతం తాను ఎప్పుడూ భవానీపూర్ అసెంబ్లీ స్థానాన్ని వీడి నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఈ నెల 1న రెండో విడతలో ఎన్నికలు జరగ్గా.. మే 2న పోలింగ్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరు మృతి
శంషాబాద్‌లో విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత
రాష్ట్రానికి నేడు వర్ష సూచన
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

