మనీలా : ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఫిలిప్పీన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ పంపిణీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించారు. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ బుధవారం వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టడానికి మధ్య ఉన్న లింక్‌ను నివేదించింది. కానీ, వ్యాక్సిన్ వినియోగానికి ఎలాంటి పరిమితులు సిఫారసు చేయలేదు. ఆస్ట్రాజెనెకా దుష్ప్రభావాలకు సంబంధించిన సమాచారాన్ని నిపుణులు సమీక్షిస్తున్నారని ఆరోగ్య శాఖ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫిలిప్పీన్స్ ఇప్పటి వరకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో పాటు చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను మాత్రమే వినియోగిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 4.60లక్షల మోతాదుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వేశారు. కరోనా కేసుల పెరుగుదల, టీకా ప్రచారం.. సరఫరా సమస్యలు, డెలివరీలో ఆలస్యంలాంటి సవాళ్లను ఫిలిప్పీన్స్ ఎదుర్కొంటోంది.