పాకిస్థాన్‌కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు ప్రత్యేక సైనిక సామాగ్రిని అందివ్వనున్నట్లు ఇవాళ రష్యా వెల్లడించింది. దీనిపై రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ దీనిపై ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు కూడా రెండు దేశాలు అంగీకరించాయి. సంయుక్త నౌక, సైనిక విన్యాసాలు కూడా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. దాదాపు దశాబ్ధ కాలం తర్వాత రష్యాకు చెందిన విదేశాంగ మంత్రి పాక్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండు దేశాలు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో లవ్రోవ్ మాట్లాడారు. ఆర్థిక, వాణిజ్య, భద్రతా, ఉగ్రవాదం, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు అంగీకరించాయన్నారు. పాక్ విదేశాంగ మంత్రి రషా మహబూద్ ఖురేషి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్ పోరాడుతోందని, ఆ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నామని, దీని కోసం ఆ దేశానికి ప్రత్యేక సైనిక సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు లవ్రోవ్ తెలిపారు. అయితే ఎటువంటి సైనిక సామాగ్రి ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ అన్ని దేశాల ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రెండు దేశాలు సైనిక విన్యాసాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. 2016 నుంచి రెండు దేశాలు డ్రుజ్బా పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. పాక్‌తో మైత్రి కొనసాగించడం పట్ల భారత్ ఆందోళన చెందవద్దు అని గతంలో రష్యా పేర్కొన్నది. ఎస్సీవో సభ్య దేశమైన పాకిస్థాన్‌తో సైనిక సంబంధాలు పెట్టుకున్నట్లు రష్యా చెప్పింది.
కొన్నేళ్ల క్రితం ఎంఐ-35ఎంకు చెందిన యుద్ధ, కార్గో విమానాలకు పాకిస్థాన్‌కు రష్యా సరఫరా చేసింది. అయితే భారత్‌లో రెండు రోజులు పర్యటించిన లవ్రోవ్ ఇవాళ పాక్‌లో విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఏ దేశంతోనూ తమకు శత్రుత్వం లేదని, ప్రాంతీయ సహకారాన్ని అందిస్తామని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

