హైదరాబాద్ రియల్టీకి దెబ్బ
తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం గడ్డు పరిస్థితులను ఎదురొంటున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది.
- గత నెల 14 శాతం పడిపోయిన రిజిస్ట్రేషన్లు
- నైట్‌ఫ్రాంక్ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం గడ్డు పరిస్థితులను ఎదురొంటున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ఇందుకు అద్దం పడుతున్నది మరి. రాష్ట్ర రాజధాని నగర పరిధిలో నివాస గృహాల రిజిస్ట్రేషన్లు నిరుడు అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో 14 శాతం పడిపోవడం గమనార్హం.
దీంతో ప్రభుత్వ విధానాలపై స్పష్టత లేకపోవడం, సరైన రోడ్ మ్యాప్ కొరవడటంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయిప్పుడు. హైదరాబాద్, మేడ్చల్-మలాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో గత ఏడాది అక్టోబర్‌లో 6,194 ప్రాపర్టీలు రిజిస్టరయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో అవి 5,318యూనిట్లకే పరిమితమయ్యాయి. కేవలం సంఖ్యాపరంగానేగాక, రిజిస్టరైన ఆస్తుల విలువ కూడా 3 శాతం తగ్గి ఈసారి రూ.4,395 కోట్లకు పడిపోయింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోల్చినా అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 5 శాతం, విలువ 2 శాతం మేర తగ్గడం మారెట్లోని తీవ్ర మందగమనాన్ని రుజువు చేస్తున్నది.
రిస్క్‌లో సొంతింటి కల
రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ఈ మందగమనం ప్రభావం.. అత్యధికంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే రూ.50 లక్షలలోపు విలువైన ఇండ్ల కొనుగోళ్లపైనే పడుతున్నది. తాజా నివేదిక ప్రకారం.. నిరుడు అక్టోబర్‌తో చూస్తే ఈ అక్టోబర్‌లో రూ.50 లక్షలలోపు గృహాల రిజిస్ట్రేషన్లు ఏకంగా 21 శాతం పడిపోగా, వాటి విలువ 18 శాతం తగ్గింది. అలాగే రూ.50 లక్షలు-రూ.1 కోటి మధ్య ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు 4 శాతం, విలువ 7 శాతం క్షీణించింది. కోటి రూపాయలకు పైబడిన విలాసవంతమైన ఇండ్ల రిజిస్ట్రేషన్లు, వాటి విలువ సైతం 6 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇదిలావుంటే మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్యలో రంగారెడ్డి జిల్లా 49 శాతంతో అగ్రస్థానంలో ఉన్నది. మేడ్చల్-మలాజిగిరి 33 శాతం, హైదరాబాద్ జిల్లా 16 శాతం, సంగారెడ్డి జిల్లా 1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల విలువలో రూ.1 కోటి కంటే ఎకువ ధర ఉన్న ఇండ్ల వాటానే 56 శాతం ఉండటం గమనార్హం.
పెట్టుబడిదారుల్లో గందరగోళం
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఆకస్మిక నిర్ణయాల వల్లే స్థిరాస్తి రంగం కుదేలవుతున్నదని రియల్ ఎస్టేట్ వర్గాలు ప్రస్తుత ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా భూముల మారెట్ విలువలను (గైడెన్స్ వాల్యూ) సవరించడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరిగి కొనుగోలుదారులపై అదనపు ఆర్థిక భారం పడింది. దీనికితోడు హైడ్రా కూల్చివేతలూ మార్కెట్ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. మెట్రో ఫేజ్-2, ఫార్మా సిటీ వంటి మెగా ప్రాజెక్టుల ప్రణాళికల్లో మార్పులు-చేర్పులూ పెట్టుబడిదారుల్లో గందరగోళాన్ని సృష్టించాయన్న అభిప్రాయాలున్నాయి.
ప్రమాదంలో హైదరాబాద్ బ్రాండ్
దాదాపు దశాబ్దకాలం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మారెట్గా గుర్తింపు పొందిన బ్రాండ్ హైదరాబాద్ ప్రతిష్ట.. ఇప్పుడు మసకబారుతున్నదని స్థిరాస్తి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించకపోతే పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే నిర్మాణ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరం కాగలవని కూడా సూచిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా.. పారదర్శకమైన విధానాలను తీసుకురావాలని కోరుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

