DK Shivakumar : కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivkumar) సైకిల్ దిగబోయి అసెంబ్లీ మెట్లపై పడిపోయాడు. సైకిల్ బ్రేక్ పట్టుకోవడం మరిచిపోయిన డీకే.. రన్నింగ్ సైకిల్ దిగుతూ మెట్లపైకి వెళ్లి కూలబడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social media) లో వైరల్ మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బెంగళూరులో మంగళవారం ఎకో-వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైకిల్‌పై అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ మెట్ల ముందు సైకిల్ దిగుతూ ఆయన సైకిల్‌పై నియంత్రణ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది ఆయనను పైకి లేపారు. RKTimes అనే ఎక్స్ హ్యాండిల్లో రాయల్ ఛాలెంజర్స్‌గా కమాల్ అంటూ వీడియోను షేర్ చేశారు.
Royal Challengers ka kamal.😹 pic.twitter.com/e61Zh57D2x
— RKTimesX (@RKTimesX) June 17, 2025