టేకులపల్లి, ఫిబ్రవరి 26 : యాసింగి పంటల సాగుకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా అందివ్వాలని బీఆర్ఎస్ టేకులపల్లి మండలాధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు సమయానికి ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఇప్పటి వరకు రెండుసార్లు రైతు భరోసా ఎగనామం పెట్టారని, యాసింగి సమయం అయిపోతున్నా ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రజా పాలన అని చెప్పి రైతులని, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఖమ్మంలో నిరుపేదల ఇళ్లను కూల్చి వారి కుటుంబాలను అన్యాయం చేసిందని, నిలువ నీడ లేని పేదలు ప్రభుత్వ భూముల్లో ఇంఢ్లు కట్టుకుని నివసిస్తుంటే వారి ఆశలను చిదిమివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను నిర్ధక్షణంగా కూల్చివేసిందని విమర్శించారు.