టేకులపల్లి, ఫిబ్రవరి 26 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వీధుల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని గోల్యాతండా సర్పంచ్ లకావత్ నాకా పంచాయతీ ప్రజలకు సూచించారు. టేకులపల్లి మండలంలోని
గోల్యాతండా సమీపంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ క్లీనింగ్‌ను గురువారం చేపట్టగా ఆయన పరిశీలించారు. వీధుల్లో చెత్త, మురుగు కాలువలు శుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చూడాలని మల్టీపర్పస్ వర్కర్స్ కు సూచించారు.