Priyanka Gandhi : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. ఆప్ భారీ ఓటమిని చవిచూసింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. ఢిల్లీ ప్రజలు పదేళ్లుగా ఒకే ప్రభుత్వాన్ని చూసి విసిగిపోయారని, అందుకే మార్పు కోసం ఓటేశారని వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సమావేశాల సందర్భంగానే తేలిపోయిందని ఆమె చెప్పారు.
‘స్థానిక పరిస్థితులతో ప్రజలు విసిగిపోయారు. వారు మార్పును కోరుకున్నారు. మార్పు కోసమే ఓటేశారని అనుకుంటున్నా. ఈ ఎన్నికల్లో గెలిచిన అందరికీ నా శుభాకాంక్షలు. మిగిలిన వారు మరింతగా శ్రమించాలని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. నేతలు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందించాలి’ అని కేరళ పర్యటనలో ఉన్న ప్రియాంకాగాంధీ సూచించారు.
కాగా, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 48 స్థానాల్లో గెలిచింది. అధికార కాంగ్రెస్ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్క ఎమ్మెల్యే సీటైనా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. న్యూఢిల్లీలో కేజ్రివాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు సీఎం పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Parvesh Verma | ఢిల్లీలో జరిగిన అవినీతిపై సిట్ వేస్తాం.. కేజ్రివాల్‌పై గెలిచిన పర్వేష్ వర్మ వెల్లడి
Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి