Parvesh Verma : ఢిల్లీ (Delhi) లో ఇంకా అధికారం చేపట్టక ముందే బీజేపీ.. ఆప్‌పై కక్ష్య సాధించనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. తమ ప్రభుత్వం కొలువుదీరగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని బీజేపీ నేత (BJP leader), న్యూఢిల్లీ (New Delhi) లో అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై గెలిచిన పర్వేష్ వర్మ (Parvesh Verma) చెప్పారు. అందులో భాగంగా ఆప్ హయాంలో ఢిల్లీలో జరిగిన అవినీతిపై సిట్ వేయడానికే తమ తొలి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. కేజ్రివాల్‌పై విజయం అనంతరం కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్న సందర్భంగా వర్మ మాట్లాడారు.
బీజేపీ అధినాయకత్వం మద్దతుతోనే ఢిల్లీలో పార్టీ గెలుపు సాధ్యమైందని వర్మ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా ఢిల్లీ ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వంపై తమకున్న విశ్వాసాన్ని చాటుకున్నారని చెప్పారు. ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరనే అంశంపై కూడా పర్వేష్ వర్మ స్పందించారు. ఎమ్మేల్యేలందరం సమావేశమై మా నాయకుడిని ఎన్నుకుంటామని, దానికి పార్టీ నాయకత్వం ఆమోదం తెలుపుతుందని అన్నారు. ప్రతి అధిష్ఠానం నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమేనని ఆయన చెప్పారు.
అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 చెల్లించడం, ఢిల్లీలో అవినీతిపై సిట్ ఏర్పాటు చేయడం, యమునా నది ప్రక్షాళన, కాలుష్యాన్ని తగ్గించడం, ట్రాఫిక్ సమస్యను తగ్గించడం తమ ప్రాధాన్యాలని వర్మ తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు గర్వంగా చెప్పుకునేలా రాజధానిని అభివృద్ధి చెస్తామని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ 22 స్థానాలే దక్కించుకుంది.
Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి