హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో(Congress) సామాన్యులు బతుకలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రజా పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస పార్టీ గెలిచాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసింది. కనీసం సామాన్యుడి గుడిసెను ఉంచకుండా బుల్డోజర్లతో కూలగొడుతున్నారు. తాజాగా మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను అటవీ శాఖ అధికారులు లాక్కోవడం కలకలం రేపింది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను అటవీ శాఖ అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేశారు. రైతులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు
జేసీబీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేస్తున్న అధికారులను అడ్డుకున్న రైతులు
సాగు చేసుకుంటూ… pic.twitter.com/SFAJxiCyH4
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2026