Naga Babu | ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. కొడుకు సినిమా హిట్‌పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్!
Naga Babu | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. రాయలసీమ నేటివిటీకి కొరియన్ కల్చర్‌ను జోడించి తెరకెక్కించిన ఈ విభిన్నమైన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది.
Naga Babu | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. రాయలసీమ నేటివిటీకి కొరియన్ కల్చర్‌ను జోడించి తెరకెక్కించిన ఈ విభిన్నమైన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది.ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటించగా.. సత్య తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ నేపథ్యంలో సాగే ఈ కథలో కనకరాజు అనే పల్లెటూరి యువకుడిని ఓ కొరియన్ ఆత్మ ఆవహిస్తుంది. ఆ తర్వాత అతడి జీవితంలో చోటుచేసుకునే విచిత్రమైన పరిణామాలు, కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
‘కొరియన్ కనకరాజు’ విడుదలైన తొలి రోజే దాదాపు రూ.10.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్గా నిలిచినట్లు తెలుస్తోంది. మొదటి రోజు వచ్చిన స్పందనతో రెండో రోజైన శనివారం కూడా సినిమా మంచి ఆక్యుపెన్సీతో కొనసాగింది. వరుణ్ తేజ్ తన గత చిత్రాలకు భిన్నంగా కామెడీ, హారర్ అంశాలతో కూడిన పాత్రలో కనిపించడం సినిమాకు ప్లస్‌గా మారింది. ముఖ్యంగా సత్య కామెడీ ట్రాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో థియేటర్లలో నవ్వులు పూస్తున్నాయని ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తోంది.
వరుణ్ తేజ్‌కు ఈ విజయం రావడంతో ఆయన తండ్రి, నటుడు నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన కుమారుడి ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.గత ఐదేళ్లుగా వరుణ్ ఎదుర్కొన్న ఒడిదుడుకులను తాను దగ్గరుండి గమనించానని నాగబాబు పేర్కొన్నారు. వరుస పరాజయాలు ఎదురైనా వరుణ్ తన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపలేదని అన్నారు. తన బాధను బయటకు చెప్పకపోయినా, ఆ వైఫల్యాలు అతడిని ఎంతగా బాధించాయో తండ్రిగా తనకు తెలుసని భావోద్వేగంగా వెల్లడించారు.ఎన్ని పరీక్షలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగిన వరుణ్‌కు ఇప్పుడు తిరుగులేని విజయం దక్కిందని నాగబాబు పేర్కొన్నారు. ఈ విజయానికి పూర్తి క్రెడిట్ తన కుమారుడి కష్టానికే దక్కుతుందని అన్నారు. వరుణ్ కెరీర్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, అందుకే అతడి పరాజయాలు ఎలా అతడివో.. ఈ విజయం కూడా పూర్తిగా అతడిదేనని తెలిపారు. ‘మై చైల్డ్ వరుణ్.. నిన్ను చూస్తుంటే తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి.
‘కొరియన్ కనకరాజు’ను నమ్మి ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ, హీరోయిన్ రితికా నాయక్, నటుడు సత్య, నిర్మాత రాజీవ్, సంగీత దర్శకుడు తమన్‌తో పాటు చిత్ర సాంకేతిక బృందానికి నాగబాబు అభినందనలు, ఆశీస్సులు తెలిపారు.వరుణ్ తేజ్ కెరీర్లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని ‘కొరియన్ కనకరాజు’ అందించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సినిమా మొదటి రెండు రోజుల్లోనే మంచి వసూళ్లు రాబట్టడంతో రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Five years… I stood by and watched everything.
My son carried the silence, the pain, the disappointments… but never stopped trying. There were no hits to his name, only failures that kept testing him. I know how much it hurt him, even when he never said it.
We used to pacify… pic.twitter.com/fO11AXgyt3— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

