వరంగల్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నల్లబెల్లి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఉద్యమకాల సహచరుడు, పార్టీలో నిబద్ధత కలిగిన అనుచరుడు, ఆత్మీయుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఇందులో సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు రూ. కోటి చొప్పున అందజేయనున్నారు.
ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆయన పిల్లల భవిష్యత్తు, వారి చదువు, తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతోపాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.