గుర్రంపోడు, సెప్టెంబర్ 11 : క్రీడలు విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని గుర్రంపోడు మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి టి.శేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలలో మండలస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ క్రీడలు యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీస్తాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు నియోజకవర్గ స్థాయి, డివిజన్ స్థాయి, రాష్ట్రస్థాయి, దేశస్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ, ఎంఈఓ నోముల యాదగిరి, స్థానిక సర్పంచ్ జాల యాదయ్య, పీఎం శ్రీ టీఎస్ఎంఎస్ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వరూప్ రెడ్డి, పీడీలు నాగేశ్వర్రావు, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పీఈటీలు శ్రీనివాస్ రెడ్డి, మారయ్య, గుంజ సత్యనారాయణ పాల్గొన్నారు.