US jobs | భారతీయులకు మరో షాక్ ఇవ్వనున్న అమెరికా.. హెచ్1బీ వీసాదారులకు గ్రేస్ పీరియడ్ తొలగింపు
US jobs : ఇప్పటికే వీసాలపై పలు ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హెచ్1బీ వీసాదారుల్లో జాబ్ కోల్పోతే.. మరో జాబ్ వెతుక్కునేందుకు ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేందుకు సిద్ధమైంది.
US jobs : ఇప్పటికే వీసాలపై పలు ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హెచ్1బీ వీసాదారుల్లో జాబ్ కోల్పోతే.. మరో జాబ్ వెతుక్కునేందుకు ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ (డీహెచ్ఎస్).. ఎలిమినేటింగ్ ద డిస్క్రెషనరీ 60 డే గ్రేస్ పీరియడ్ పేరుతో ఒక ప్రతిపాదన చేసింది.
దీనర్థం.. హెచ్1బీ సహా వివిధ వీసాలు కలిగిన విదేశీ పౌరులు తమ ఉద్యోగాలు కోల్పోతే ఇకపై వారికి కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ వర్తించదు. హెచ్1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోతే అమెరికాలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే, ఉద్యోగం పోయినా.. 60 రోజులపాటు అక్కడే ఉండొచ్చు. కానీ, కొత్త ప్రతిపాదన అమలైతే ఈ గ్రేస్ పీరియడ్ వర్తించదు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఫెడరల్ రిజిష్టర్‌లో నమోదు చేశారు. దీనిపై ప్రజలు 60 రోజుల్లోగా తమ అభిప్రాయాలు చెప్పాలి. ఆ తర్వాత ఈ రూల్ అమలులోకి రావొచ్చు.
ఇది అమెరికాలో ఉద్యోగాలు లేని ఈ1, ఈ2, ఈ3, హెచ్1బీ, హెచ్1బీ1, ఎల్1, ఓ1, టీఎన్ వీసాదారులందరికీ వర్తిస్తుంది. ఈ రూల్ అమలులోకి వస్తే అమెరికాలో ఉంటున్న భారతీయులపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో హెచ్1బీ వీసా మీద పని చేస్తున్నారు. ఒకవేళ ఉన్నట్లుండి అక్కడ ఉద్యోగం కోల్పోతే.. కొత్త రూల్ ప్రకారం వెంటనే అమెరికా వీడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలా ఉద్యోగం కోల్పోయిన చాలా మంది గ్రేస్ పీరియడ్లోపు మరో ఉద్యోగం వెతుక్కుంటున్నారు. కానీ, కొత్త రూల్‌తో భారతీయులకు ఇబ్బందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Grace Period
- H-1B
- job loss
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

