Harish Rao | కలెక్టర్ల మెడపై కత్తిపెట్టి 22ఏ లిస్టులో భూములను పెట్టించారని, కేసీఆర్ సమస్యలను పరిష్కరిస్తే రేవంత్ సమస్యలు సృష్టించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్క సెంట్ భూమి కూడా మా ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదన్న వ్యాఖ్యలపై ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్లో 22A నిషేదిత జాబితా స్కాంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 11-09-2025 రోజున కొత్త నిషేధిత జాబితా లిస్ట్ పంపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేశారు.
20-11-2025న జనగామ కలెక్టర్ నిషేధిత జాబితా లిస్ట్ తయారు చేసి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు పంపారని తెలిపారు. ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కలెక్టర్ పంపిన భూముల జాబితాను 22-A నిషేధిత జాబితాలో పెడుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా అన్ని జిల్లాల్లో పెట్టారన్నారు. సిర్పూర్ – కాగజ్ నగర్ ప్రాంతంలో 30 వేల ఎకరాలు అక్టోబర్ 2025లో నిషేధిత జాబితాలో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే మంచిర్యాల నియోజకవర్గంలో 11 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టారు. 33 జిల్లాల కలెక్టర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని లిస్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపింది నిజం కాదా అని ప్రశ్నించారు. అన్ని జిల్లాల కలెక్టర్ల జీవోల ఆధారాలతో చూపించాం.. చీము నెత్తురు ఉంటే పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పొంగులేటి వ్యాఖ్యలపై ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు
11-09-2025 నాడు కొత్త నిషేధిత జాబితా లిస్ట్ పంపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేశారు
20-11-2025 నాడు జనగామ కలెక్టర్ నిషేధిత జాబితా లిస్ట్ తయారు చేసి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు పంపారు
ఐజీ స్టాంప్స్ అండ్… https://t.co/J8Rru9CljY pic.twitter.com/8AejNIwq6C
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2026