Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగబోతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడి ఓటర్లపై హామీలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కీలకంగా మారే దళిత ఓటర్ల (Dalit voters) పై మూడు పార్టీలు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. దాంతో ఈసారి ఢిల్లీలో దళితుల ఓట్లు మూడు పార్టీల మధ్య చీలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. అంతేగాక మరో 30 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో దళితుల ఓట్లు ఉన్నాయి. ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ దళిత ఓటర్లు బీజేపీ వైపే మొగ్గుచూపారు. ఆప్ రెండు పర్యాయాలు వరుసగా అధికారంలోకి రావడంలో దళితుల ఓట్లు కీలకపాత్ర పోషించాయి. అయితే రెండు సార్లు ఆప్‌కు అధికారం కట్టబెట్టినా దళితుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు.
దాంతో దళితుల్లో కొందరు ప్రస్తుతం ఆప్‌పై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆప్‌కు దళితుల మద్దతు తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు, సబాల్టర్న్ మీడియా పౌండేషన్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ కుశ్ అంబేద్కర్‌వాదీ చెప్పారు. ఇక బీజేపీకైతే ఢిల్లీలో ఎప్పుడూ దళితుల ఆదరణ లభించలేదు. అందుకే 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది.
అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ 2-3 సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. దాంతో ఈసారైనా దళిత ఓటర్ల మనసు గెలువాలని ఆ పార్టీ ప్రణాళిలు సిద్ధం చేస్తోంది. దళితులను ఆకర్షించేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది. వారిని ఊరించే హమీలు గుప్పిస్తోంది. దళిత మెజారిటీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దళితుల ఓట్లను ఆకర్షించేందుకు గత కొన్ని నెలలుగా బీజేపీ ఎస్సీ మోర్చా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలావుంటే ఆప్‌పై దళిత ఓటర్లు అసంతృప్తిగా ఉండటంతో తమకు ఎస్సీ నియోజకవర్గాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. కానీ దళిత ఓటర్లను ఆకర్షించడంలో మాత్రం కాంగ్రెస్ ఆలస్యం చేస్తోంది. ఈ విషయాన్ని గత ఏడాది ఆప్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమే స్వయంగా చెప్పారు. దళిత ఓటర్లను ఆకర్షించేలా ముందే ప్రచారం ప్రారంభించి ఉంటే మరింత మద్దతు పొందేవాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో ఆప్‌కు దళితుల్లో ఆదరణ తగ్గినప్పటికీ మెజారిటీ దళిత ఓటర్లు ఆప్ వైపే మొగ్గే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకంటే బీజేపీపై ఢిల్లీ దళితుల్లో అనాదిగా సదభిప్రాయం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ దళితులను ఆకర్షించడంలో విఫలం కావడం లాంటి పరిణామాలు ఆప్‌కు కలిసివచ్చేలా ఉన్నాయి. మూడు పార్టీలను పోల్చి చూస్తే తమకు ఆపే బెటర్ అనే ఆలోచనలో మెజారిటీ దళితులు ఉన్నారు.
Saif Ali Khan case | ‘నా కొడుకును అక్రమంగా ఇరికించారు..’ భారత మీడియా సంస్థతో సెహజాద్ తండ్రి
Saif Ali Khan case | సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. నిందితుడి పోలీస్ కస్టడీ పొడిగింపు
Crime news | రాత్రంతా పరిచయస్తుడితో బయటికి.. తెల్లారి ఇంట్లో వాళ్లు తిడతారని..!
Crime news | అమానవీయం.. అప్పు చెల్లించలేదని మహిళను తీవ్రంగా కొట్టి.. గుండు గీసి..!
Virender Sehwag: విడాకులు తీసుకునే ఆలోచనలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ !
Earthquake | ఉత్తరకాశీని వణికించిన భూకంపం
Kamala Harris | భర్త వల్లే ఓడిపోయిందా.. కమల హారిస్ దంపతుల విడాకులు?