గుట్ట ఆలయం మూసివేత
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మంగళవా రం ఆలయ ప్రధానార్చకులు, ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు గ్రస్తోదయ చంద్ర గ్రహ ణం కొనసాగింది.
యాదగిరిగుట్ట, మార్చి 3 : సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మంగళవా రం ఆలయ ప్రధానార్చకులు, ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు గ్రస్తోదయ చంద్ర గ్రహ ణం కొనసాగింది. అంతకుముందు ఉదయం 3 గంటలకు ప్రధానార్చక బృందం ఆలయాన్ని తెరిచి ఆరగంట పాటు సుప్రభాత సేవ కొనసాగించారు. అర్చనలు, బాలభోగం ముగించి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
అనంతరం 7 గంటలకు ద్వారాబంధనం గావించి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి గ్రహణ దోష పరిహారార్థం, సంప్రోక్షణ ఆలయ శుద్ధి చేపట్టి స్వామి, అమ్మవార్ల నిత్యకైంకర్యాలను ప్రారంభించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆలయాన్ని మూసివేయడంతో యాదాద్రి పరిసర ప్రాంతాలను నిర్మానుష్యంగా మారాయి. క్యూలైన్లు, మాడవీధులు భక్తులు లేక బోసిపోయాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

