Kamala Harris | భర్త వల్లే ఓడిపోయిందా.. కమల హారిస్ దంపతుల విడాకులు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాటిక్ నేత కమల హారిస్ జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్నది. తన భర్త డగ్ ఎమ్హోఫ్ వల్లే తాను ఓడిపోయానని ఆమె ఆక్రోశిస్తున్నట్లు తెలుస్తున్నది.
Kamala Harris | వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాటిక్ నేత కమల హారిస్ జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్నది. తన భర్త డగ్ ఎమ్హోఫ్ వల్లే తాను ఓడిపోయానని ఆమె ఆక్రోశిస్తున్నట్లు తెలుస్తున్నది. ఓ మీడియా కథనం ప్రకారం, తన భర్త తనకు మోయలేని భారంగా మారారని ఆమె మండిపడుతున్నారు. డగ్ తన బిడ్డను చూసుకునే నానీని గర్భవతిని చేయడం, తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం వంటివి కమల హారిస్‌కు తలనొప్పి తీసుకొచ్చాయి.
కమల న్యూయార్క్‌లోని ఓ న్యాయవాద సంస్థలో ఉద్యోగం కోసం సంతకం చేశారు. ఆమె భర్త ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్నారు. వచ్చే ఏడాది కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా 2028లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కూడా. ఈ మధ్య కాలంలో తన భర్త వల్ల తనకు మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కమల, డగ్ హాజరైనప్పటికీ, వీరిద్దరి మధ్య సయోధ్య లేదని తెలిపింది. ఈ నివేదిక ఈ నెల 22న వచ్చింది. అదే రోజు డగ్ తన పెండ్లినాటి ఉంగరాన్ని ధరించి కనిపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

